Thursday, November 26, 2009

వ్యవస్థ పై పొరాటం.....

ఒక్క సారి విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నటైతే........

Where the mind is without fear,
ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో...

Where the head is held high,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో....

Where knowledge is free;
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో...

Where the world has not been broken up
into fragments by narrow domestic walls,
ఎక్కడ ప్రపంచం ముక్కలుముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో...

Where words come out from the depth of truth,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి వాక్కు బైటికి రాగలదో.....

Where the clear stream of reason
has not lost its way into the dreary desert sand of dead habit;
ఎక్కడ నిర్జీవమైన ఆచారాల ఎడారిలో స్వచ్చమైన బుద్ది ప్రవాహం ఉంటుందో....

Where tireless striving stretches its arms towards perfection;
ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు సారిస్తుందో....

Where the mind is led forward by thee into ever-widening thought and action,
ఎక్కడ మనస్సు తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు పయనిస్తుందో.......

అలాంటి స్వేచ్ఛాస్వర్గంలోకి నా దేశాన్ని మేల్కోలుపు తండ్రీ.................!

అన్న మాటల్ని స్పూర్తిగా తీసుకొని ఠాగూర్ కలలు కన్న స్వేచ్చాస్వర్గంలోకి మన దేశాన్ని నడిపించడానికి
రండి మనమంతా కలిసి వ్యవస్థ పై పోరాడుదామ్......


"ఈ వ్యవస్థ మారటంకోసం ప్రళయమే రావాల్సి వస్తే, ఆ ప్రళయాన్ని ఈ క్షణమే ఆహ్వానిస్తున్నాన్నేను. ప్రళయం రావాలి. ఆ ప్రళయకాల ఝుంఝూ మారుతంలో....
ప్రక్షాళనమైన మనస్సుతో, వ్యవస్థలో మనిషి కొత్త జీవితం ప్రారంభించాలి".

Wednesday, November 25, 2009

మనిషి ఒక్కడుగానే కాదు జాతి జాతిగానే దుర్మార్గుడు.........

మనిషి ఒక్కడుగానే కాదు జాతి జాతిగానే దుర్మార్గుడు,
ఎంతటి దౌర్జన్యం లేకపొతే తరతరాలుగ ప్రవహిస్తున్న వైదిక తేజస్వి జీవనస్రవంతికి మోకాలడ్దుతాడు,
తానొక్కడే ఆశాశ్వత సౌఖ్యాలను అనుభవించాలనే దుష్ట సంకల్పంతో,
సత్సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు.
కాని మనిషి ఏదో మజిలికో, చిరుశిఖరాగ్రానికో చేరుకోగానే సాధకోత్సాహం ఉపశమించి శూన్యంలోకి జారిపోతాడు,
వైభవోపేతమైన ఒంటరితనం ఆవహించి ఏకాకిగా మిగిలిపోతాడు.
గతం మీద బెంగపడతాడు తాను విదిల్చికొట్టిన,వదిలించుకొన్న తన్నిపారేసిన ఒలకబోసుకున్న,
మధురక్షణాలను, ప్రేమానురాగాలను వాటి ప్రతిరూపాలైన మనుషులను తలచుకొని గుక్కపెట్టి
వెక్కివెక్కి ఏడుస్తాడు.
గర్బస్థ శిశువు నిద్రలో గత జన్మల కలవరింతలున్నట్టే,
ఈ భూమండలం తన మీద నడయాడిన కాలాలను వాటితోపాటే సాంప్రదాయలను, పదిలపర్చుకుంటూ తరతరాలకు అందిస్తూనేవుంది.
మానవుడే వైభవొపేతమైన సాంప్రదాయలను విస్మరించి చితిలో ఆత్మీయుల అస్థికల కోసం వెదుకులాడుతు,
వర్తమానంలో పతనమై వచ్చుకాలము కంటే గతకాలము మేలన్న నన్నయ్యను గుర్తుతెచ్చుకుంటాడు.
ఉందిలే మంచికాలం ముందుముందునా అంటూ ధైర్యం చెప్పిన
వైతాళికులు సైతం పసిడిరెక్కలు విసిరి పారిపోయిన,
మసకబారిన సాంప్రదాయపు జాడలకోసం తడుముకుంటాడు.
భవిష్యత్తు మీద శంకే గతం మీద బెంగ,
తొణికిన స్వప్నాలను మరోసారి హత్తుకోవాలని విరిగిన బంధాలను తిరిగి అతికించుకోవాలని,
పల్లెటూరు,మట్టిబాల్యం,వీధిబడులు,జమ్మిచెట్టు,పాలపిట్ట,
సేమోల్లంఘనం,అలైబలైలు మళ్ళీరావు ఎక్కడ ఉంటాయో అసలు
ఉండవో కూడా భవిష్యత్తు తరానికి తెలియదు.
శిథిలమయ్యి ,శల్యమయ్యి, అవన్ని అక్కడే ఉంటాయ్,
కాని మనం అక్కడికి వెళ్ళం, చిట్టచివరికి బెంగపడడం మీద ఉన్నంత మోజు
తీర్చుకోవడం మీద ఉండదు.
వాస్తవంలో అంతరిస్తున్న సాంప్రదాయలను కాపాడుకోలేకుంటే, ముందుతరాలకు అందించకుంటే మానవుని నిర్వచనమే మారిపోతుంది ప్రశ్నార్థకమవుతుంది...!