Saturday, August 25, 2012

బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో రాళ్ళకు పాలిచ్చు కథ నశించునదెన్నడో..... పేడకు బొట్టేట్టి దైవమని పూజించువారు పేదను గుర్తించగ మారబోవునదెన్నడో..... ఎపుడచ్చును దేశానికి చైతన్యం అది తెచ్చుట కదా మన కర్తవ్యం. - VETOORI
పగలు గడిచిపొతే, పక్షులింక పాడకపొతే, గాలి అలసి సొమ్మగిల్లితే చీకటి మేలి ముసుగుని నా మీద కప్పెయ్యు .ఈ జీవితంలో నిన్ను కలుసుకొనే భాగ్యం నాకు లేకపోయిన నీ దర్శనాన్ని పొందలేకపొతున్నాననే తీరని వాంఛని నా నుంచి తప్పించకు ప్రభూ.... - Rabindranath Tagore ( Geethanjali )
నేను చూసాను నిజంగా_ ఆకలితో అల్లాడి మర్రిచెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి. నేను చూసాను నీరంధ్ర వర్షాన వంతెన క్రింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. నేను చూసాను నిజంగా_ తల్లి లేక తండ్రి లేక ఏడుస్తూ మోజేతులతో కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ ప్రక్కనే నిద్రించిన మూడేళ్ళ పసివాన్ని. నేను చూసాను నిజంగా_ మూర్తిభవత్ దైన్యాన్ని, హ ైన్యాన్ని........ నాకు శాంతి కలగదింక నేస్తం. నేను నిగర్వినైనాను. ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు ? ఏ భగవంతునికి నివేదించుకోగలదు ?? వద్దు....ఇక నన్ను నిర్భంధించకు నేస్తం. ఈ రాత్రి నేను పాడలేను. ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను.. - దేవరకొండ బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి )
నా కవిత్వం కాదొక తత్వం మరికాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం, సామ్యవాదం కాదయ్యాఅయోమయం, జరామయం నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిలల్లు - దేవరకొండ బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి)
పగళ్ళన్నీ పగిలిపోయీ, నిశీధాలూ విశీర్ణిల్లీ, మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది! నే నొకణ్ణీ ధాత్రినిండా నిండిపోయీ- నా కుహూరుత శీకరాలే లోకమంతా జల్లులాడేను! ఆ ముహూర్తా లాగమిస్తాయి ఎండాకాలం మండినప్పుడు గబ్బిలవలె క్రాగిపోలేదా! వానాకాలం ముసిరిరాగా నిలివు నిలువున నీరు కాలేదా? శీతాకాలం కోతపెట్టగ కొరడు కట్టీ, ఆకలేసీ కేకలేశానే! నే నొక్కణ్ణే నిల్చిపోతే- చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు భూమి మీదా భగ్నమౌతాయి! నింగినుండీ తొంగిచూసే రంగు రంగుల చుక్కలన్నీ రాలి, నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి! - Sri Sri