Sunday, December 5, 2010

గ్రహాంతర వాసుల సమాచారాన్ని అమెరికా దాచుకొంది! త్వరలోనే బయటపెడతాం

"వికిలీక్స్ అధినేత అసాంజ్ వెల్లడి"

లండన్, డిసెంబర్ 4: గ్రహాంతర వాసులకు సంబంధించి.. అమెరికా వద్దనున్న రహస్య సమాచారంపై పరిశోధనాత్మక వెబ్‌సైట్ 'వికిలీక్స్' కన్నుపడింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాణాలకు సైతం తెగించి.. అగ్రరాజ్యం రహస్యాలను బహిర్గతం చేస్తున్న 'వికిలీక్స్' స్థాపకుడు జూలియన్ అసాంజ్.. గ్రహాంతర వాసులు, భూమి మీదకు వచ్చిన ఎగిరే పళ్లేలకు సంబంధించి.. తన దేశానికి మాత్రమే ఉపయోగపడేలా అమెరికా దాచుకున్న సమాచారాన్ని త్వరలోనే ప్రపపంచం ముందు ఉంచుతానని పేర్కొన్నాడు.

Saturday, November 27, 2010


నా ప్రేమ స్వచ్చమైనదైతే నీవెందుకు నాకు!నీ జ్ఞాపకం చాలు! నాతో ఉండాలనుకోవటం స్వార్థం. నాప్రేమ ఎప్పుడైతే ఈ స్వార్ధాన్ని అధిగమించిందో, అది నిన్ను దాటి జాతిని, కులాన్ని రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని దాటి విశ్వవ్యాప్తమవుతుంది. అదే విశ్వజనీనమైన ప్రేమ.

రాజకీయ పార్టీల పట్టుదల ఖరీదు ’ 63 కోట్లు.........

న్యూఢిల్లీ: జేపీసీ ఏర్పాటుపై రాజకీయ పార్టీల పట్టుదల ఖరీదు ’ 63 కోట్లు.
2జీ స్పెక్ట్రం వ్యవహారంపై జేపీసీ కోరుతూ ప్రతిపక్షం, అందుకు నిరాకరిస్తూ
ప్రభుత్వం పట్టువీడకపోవడంతో.. పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం
తెలిసిందే. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయసభల్లో గత 8 రోజులుగా
ముఖ్యమైన శాసనసంబంధ కార్యక్రమాలేవీ చేపట్టలేకపోయారు. ఈ 8 రోజులకు ...గాను
పార్లమెంటు సమావేశాల నిర్వహణ కోసం ఖర్చైన మొత్తం ’ 63 కోట్లని అధికారిక
అంచనా.

Sunday, September 19, 2010

నాసాలో టిప్పు సుల్తాన్ చిత్ర పటం....


శ్రీరంగపట్నం నుంచి శ్రీహరికోట దాకా....

              
               అక్షరాలా భారత అంక్షరిక్ష పరిశోధనా చరిత్ర కర్నాటకలోని శ్రీరంగ పట్నం నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వరకు పయనించిందంటే బహుశా చాలామంది నమ్మలేరు. నమ్మలేకున్నా ఇది నిజమే.. ఎందుకంటే అంతరిక్షంలోకి ప్రస్తుతం ప్రపంచం నలుమూలలనుంచి దూసుకెళుతున్న రాకెట్ పరిజ్ఞానాన్ని మానవ చరిత్రలో మొదటిసారిగా కనిపెట్టింది మన భారతీయుడే.. మన టిప్పుసుల్తాన్ అనేదే నమ్మలేని నిజం.

             
ప్రపంచంలో మొట్టమొదటి .యుద్ధ రాకెట్ను కనిపెట్టింది టిప్పు సుల్తానే మరి. 17 శతాబ్దంలో తన రాజధాని శ్రీరంగపట్నంలో టిప్పుసుల్తాన్ మొదలెట్టిన భారతీయ రాకెట్ మహా ప్రస్థానం ఇప్పుడు చంద్రయాన్1 ప్రయోగ వేదిక అయిన శ్రీహరికోటలో తారాస్థాయికి చేరింది.
            బ్రతికి ఉన్నంతవరకూ భారత్లో బ్రిటిష్ సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన టిప్పు సుల్తాన్ 1799లో కర్నాటకలోని తురకనహళ్లిలో జరిగిన భీకర యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాతే ఆయన రూపొందించి అభివృద్ధి చేసిన చరిత్రలో మొట్టమొదటి రాకెట్ కథ బయటి ప్రపంచానికి తెలిసింది.

                 
టిప్పు వీరమరణం తర్పాత ఆయన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సేనాని విలియం కాంగ్రెస్ స్థావరంలో 1600 యుద్ధరాకెట్లు కనుగొని నివ్వెరపోయాడు. తమ జ్ఞానానికి మించిన నూతన యుద్ధ తంత్రం ఒక ప్రాచ్యదేశంలో బయటపడగానే తక్షణం రాకెట్లను ఇంగ్లండ్ తరలించారు. టిప్పు యుద్ధంలో బతికి ఉంటే అనే ప్రశ్నలు సమాధానం ఇవ్వవు.

కాని ఇంగ్లండ్ చేరిన టిప్పు రాకెట్లతో పాటు దాని పరిజ్ఞానం కూడా దేశం దాటిపోయిందంటే నమ్మాలి మరి. అత్యంత ప్రాథమిక జ్ఞానంతో టిప్పు రూపొందించిన తొలితరం యుద్ధ రాకెట్ కేవలం రెండు కిలోల బరువు ఉండేది. అయిదు సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల పొడవు ఉన్న రాకెట్లో కిలో గన్ పౌడర్ దట్టించి దానినే ఇంధనంగా మండిస్తూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువులను సైతం గడగడలాడించే వారు. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో రాకెట్ లాంచ్ప్యాడ్లు సైతం ఉండేవని చరిత్రకారుల భావన.

                 
ఆలా మానవ చరిత్రలో మొదటి సారిగా టిప్పుసుల్తాన్ కనుగొన్న యుద్ధ రాకెట్ పరిజ్ఞానం ఆయన అనూహ్య మరణంతో ఆంగ్లేయుల హస్తగతమై 150 సంవత్సరాల పాటు మరుగున పడి ఉండటం మరింత ఆశ్చర్యం గొలిపిస్తుంది. తర్వాత 20 శతాబ్ది మొదట్లో అంటే 1903లో రష్యాకు చెందిన కాన్స్టాంటిన్ షల్కోవస్కీ, అమెరికా సైంటిస్టు రాబర్ట్ గోడాన్ (1914), జర్మనీలో హెర్మన్ ఓబెర్త్‌ (1923) యుద్ధరాకెట్లకు మరితం ఆధునికత జోడించిన ఫలితంగా 1950 మధ్యలో అంతరిక్ష విజ్ఞానం కొత్త పుంతలు తొక్కింది.

                  
మరుగున పడిన భారతీయ మహా యుద్ధ తంత్ర చరిత్రకు పరమ సాక్షీభూతంగా టిప్పు సుల్తాన్ చిత్రపటం అమెరికా అంతరిక్ష కేంద్రమైన నాసాలో నాటికీ ఉంది. 17 శతాబ్దానికి చెందిన భారతీయ రాజు చిత్రపటానికి నాసాకు ఉన్న సంబంధం ఏమిటి? అంతరిక్షానికి, టిప్పుసుల్తాన్ తొలి ప్రయోగానికి, మానవ జ్ఞాన పరంపరకు ఉన్న సంబంధం అది....

                                  "నాసాలో టిప్పు సుల్తాన్ చిత్ర పటం"