నేను చూసాను నిజంగా_
ఆకలితో అల్లాడి మర్రిచెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి.
నేను చూసాను నీరంధ్ర వర్షాన
వంతెన క్రింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని.
నేను చూసాను నిజంగా_
తల్లి లేక తండ్రి లేక ఏడుస్తూ
మోజేతులతో కన్నులు తుడుచుకుంటూ
మురికి కాల్వ ప్రక్కనే నిద్రించిన మూడేళ్ళ పసివాన్ని.
నేను చూసాను నిజంగా_
మూర్తిభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని........
నాకు శాంతి కలగదింక నేస్తం.
నేను నిగర్వినైనాను.
ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు ?
ఏ భగవంతునికి నివేదించుకోగలదు ??
వద్దు....ఇక నన్ను నిర్భంధించకు నేస్తం.
ఈ రాత్రి
నేను పాడలేను. ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను..
(DEVARAKONDA BALAGANGADHAR THILAK)
Tuesday, August 9, 2011
Sunday, December 5, 2010
గ్రహాంతర వాసుల సమాచారాన్ని అమెరికా దాచుకొంది! త్వరలోనే బయటపెడతాం
"వికిలీక్స్ అధినేత అసాంజ్ వెల్లడి"
లండన్, డిసెంబర్ 4: గ్రహాంతర వాసులకు సంబంధించి.. అమెరికా వద్దనున్న రహస్య సమాచారంపై పరిశోధనాత్మక వెబ్‌సైట్ 'వికిలీక్స్' కన్నుపడింది. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాణాలకు సైతం తెగించి.. అగ్రరాజ్యం రహస్యాలను బహిర్గతం చేస్తున్న 'వికిలీక్స్' స్థాపకుడు జూలియన్ అసాంజ్.. గ్రహాంతర వాసులు, భూమి మీదకు వచ్చిన ఎగిరే పళ్లేలకు సంబంధించి.. తన దేశానికి మాత్రమే ఉపయోగపడేలా అమెరికా దాచుకున్న సమాచారాన్ని త్వరలోనే ప్రపపంచం ముందు ఉంచుతానని పేర్కొన్నాడు.

Saturday, November 27, 2010
రాజకీయ పార్టీల పట్టుదల ఖరీదు ’ 63 కోట్లు.........
న్యూఢిల్లీ: జేపీసీ ఏర్పాటుపై రాజకీయ పార్టీల పట్టుదల ఖరీదు ’ 63 కోట్లు.
2జీ స్పెక్ట్రం వ్యవహారంపై జేపీసీ కోరుతూ ప్రతిపక్షం, అందుకు నిరాకరిస్తూ
ప్రభుత్వం పట్టువీడకపోవడంతో.. పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం
తెలిసిందే. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయసభల్లో గత 8 రోజులుగా
ముఖ్యమైన శాసనసంబంధ కార్యక్రమాలేవీ చేపట్టలేకపోయారు. ఈ 8 రోజులకు ...గాను
పార్లమెంటు సమావేశాల నిర్వహణ కోసం ఖర్చైన మొత్తం ’ 63 కోట్లని అధికారిక
అంచనా.

Sunday, September 19, 2010
నాసాలో టిప్పు సుల్తాన్ చిత్ర పటం....
| ||||||||
అక్షరాలా భారత అంక్షరిక్ష పరిశోధనా చరిత్ర కర్నాటకలోని శ్రీరంగ పట్నం నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వరకు పయనించిందంటే బహుశా చాలామంది నమ్మలేరు. నమ్మలేకున్నా ఇది నిజమే.. ఎందుకంటే అంతరిక్షంలోకి ప్రస్తుతం ప్రపంచం నలుమూలలనుంచి దూసుకెళుతున్న రాకెట్ల పరిజ్ఞానాన్ని మానవ చరిత్రలో మొదటిసారిగా కనిపెట్టింది మన భారతీయుడే.. మన టిప్పుసుల్తాన్ అనేదే ఆ నమ్మలేని నిజం. ప్రపంచంలో మొట్టమొదటి .యుద్ధ రాకెట్ను కనిపెట్టింది టిప్పు సుల్తానే మరి. 17వ శతాబ్దంలో తన రాజధాని శ్రీరంగపట్నంలో టిప్పుసుల్తాన్ మొదలెట్టిన భారతీయ రాకెట్ మహా ప్రస్థానం ఇప్పుడు చంద్రయాన్1 ప్రయోగ వేదిక అయిన శ్రీహరికోటలో తారాస్థాయికి చేరింది. బ్రతికి ఉన్నంతవరకూ భారత్లో బ్రిటిష్ సైన్యాలను ముప్పుతిప్పలు పెట్టిన టిప్పు సుల్తాన్ 1799లో కర్నాటకలోని తురకనహళ్లిలో జరిగిన భీకర యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాతే ఆయన రూపొందించి అభివృద్ధి చేసిన చరిత్రలో మొట్టమొదటి రాకెట్ కథ బయటి ప్రపంచానికి తెలిసింది. టిప్పు వీరమరణం తర్పాత ఆయన సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సేనాని విలియం కాంగ్రెస్ ఆ స్థావరంలో 1600 యుద్ధరాకెట్లు కనుగొని నివ్వెరపోయాడు. తమ జ్ఞానానికి మించిన నూతన యుద్ధ తంత్రం ఒక ప్రాచ్యదేశంలో బయటపడగానే తక్షణం ఆ రాకెట్లను ఇంగ్లండ్ తరలించారు. టిప్పు ఆ యుద్ధంలో బతికి ఉంటే అనే ప్రశ్నలు సమాధానం ఇవ్వవు. కాని ఇంగ్లండ్ చేరిన టిప్పు రాకెట్లతో పాటు దాని పరిజ్ఞానం కూడా దేశం దాటిపోయిందంటే నమ్మాలి మరి. అత్యంత ప్రాథమిక జ్ఞానంతో టిప్పు రూపొందించిన తొలితరం యుద్ధ రాకెట్ కేవలం రెండు కిలోల బరువు ఉండేది. అయిదు సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్లో కిలో గన్ పౌడర్ దట్టించి దానినే ఇంధనంగా మండిస్తూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువులను సైతం గడగడలాడించే వారు. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో రాకెట్ లాంచ్ప్యాడ్లు సైతం ఉండేవని చరిత్రకారుల భావన. ఆలా మానవ చరిత్రలో మొదటి సారిగా టిప్పుసుల్తాన్ కనుగొన్న యుద్ధ రాకెట్ పరిజ్ఞానం ఆయన అనూహ్య మరణంతో ఆంగ్లేయుల హస్తగతమై 150 సంవత్సరాల పాటు మరుగున పడి ఉండటం మరింత ఆశ్చర్యం గొలిపిస్తుంది. తర్వాత 20వ శతాబ్ది మొదట్లో అంటే 1903లో రష్యాకు చెందిన కాన్స్టాంటిన్ షల్కోవస్కీ, అమెరికా సైంటిస్టు రాబర్ట్ గోడాన్ (1914), జర్మనీలో హెర్మన్ ఓబెర్త్ (1923) యుద్ధరాకెట్లకు మరితం ఆధునికత జోడించిన ఫలితంగా 1950ల మధ్యలో అంతరిక్ష విజ్ఞానం కొత్త పుంతలు తొక్కింది. మరుగున పడిన ఈ భారతీయ మహా యుద్ధ తంత్ర చరిత్రకు పరమ సాక్షీభూతంగా టిప్పు సుల్తాన్ చిత్రపటం అమెరికా అంతరిక్ష కేంద్రమైన నాసాలో ఈ నాటికీ ఉంది. 17వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు చిత్రపటానికి నాసాకు ఉన్న సంబంధం ఏమిటి? అంతరిక్షానికి, టిప్పుసుల్తాన్ తొలి ప్రయోగానికి, మానవ జ్ఞాన పరంపరకు ఉన్న సంబంధం అది.... | |||||||
| "నాసాలో టిప్పు సుల్తాన్ చిత్ర పటం" | |||||||
Thursday, November 26, 2009
వ్యవస్థ పై పొరాటం.....
ఒక్క సారి విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నటైతే........
Where the mind is without fear,
ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో...
Where the head is held high,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో....
Where knowledge is free;
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో...
Where the world has not been broken up
into fragments by narrow domestic walls,
ఎక్కడ ప్రపంచం ముక్కలుముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో...
Where words come out from the depth of truth,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి వాక్కు బైటికి రాగలదో.....
Where the clear stream of reason
has not lost its way into the dreary desert sand of dead habit;
ఎక్కడ నిర్జీవమైన ఆచారాల ఎడారిలో స్వచ్చమైన బుద్ది ప్రవాహం ఉంటుందో....
Where tireless striving stretches its arms towards perfection;
ఎక్కడ అలసట ఎరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు సారిస్తుందో....
Where the mind is led forward by thee into ever-widening thought and action,
ఎక్కడ మనస్సు తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు పయనిస్తుందో.......
అలాంటి స్వేచ్ఛాస్వర్గంలోకి నా దేశాన్ని మేల్కోలుపు తండ్రీ.................!
అన్న మాటల్ని స్పూర్తిగా తీసుకొని ఠాగూర్ కలలు కన్న స్వేచ్చాస్వర్గంలోకి మన దేశాన్ని నడిపించడానికి
రండి మనమంతా కలిసి వ్యవస్థ పై పోరాడుదామ్......
"ఈ వ్యవస్థ మారటంకోసం ప్రళయమే రావాల్సి వస్తే, ఆ ప్రళయాన్ని ఈ క్షణమే ఆహ్వానిస్తున్నాన్నేను. ప్రళయం రావాలి. ఆ ప్రళయకాల ఝుంఝూ మారుతంలో....
ప్రక్షాళనమైన మనస్సుతో, వ్యవస్థలో మనిషి కొత్త జీవితం ప్రారంభించాలి".

Wednesday, November 25, 2009
మనిషి ఒక్కడుగానే కాదు జాతి జాతిగానే దుర్మార్గుడు.........
మనిషి ఒక్కడుగానే కాదు జాతి జాతిగానే దుర్మార్గుడు,
ఎంతటి దౌర్జన్యం లేకపొతే తరతరాలుగ ప్రవహిస్తున్న వైదిక తేజస్వి జీవనస్రవంతికి మోకాలడ్దుతాడు,
తానొక్కడే ఆశాశ్వత సౌఖ్యాలను అనుభవించాలనే దుష్ట సంకల్పంతో,
సత్సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు.
కాని మనిషి ఏదో మజిలికో, చిరుశిఖరాగ్రానికో చేరుకోగానే సాధకోత్సాహం ఉపశమించి శూన్యంలోకి జారిపోతాడు,
వైభవోపేతమైన ఒంటరితనం ఆవహించి ఏకాకిగా మిగిలిపోతాడు.
గతం మీద బెంగపడతాడు తాను విదిల్చికొట్టిన,వదిలించుకొన్న తన్నిపారేసిన ఒలకబోసుకున్న,
మధురక్షణాలను, ప్రేమానురాగాలను వాటి ప్రతిరూపాలైన మనుషులను తలచుకొని గుక్కపెట్టి
వెక్కివెక్కి ఏడుస్తాడు.
గర్బస్థ శిశువు నిద్రలో గత జన్మల కలవరింతలున్నట్టే,
ఈ భూమండలం తన మీద నడయాడిన కాలాలను వాటితోపాటే సాంప్రదాయలను, పదిలపర్చుకుంటూ తరతరాలకు అందిస్తూనేవుంది.
మానవుడే వైభవొపేతమైన సాంప్రదాయలను విస్మరించి చితిలో ఆత్మీయుల అస్థికల కోసం వెదుకులాడుతు,
వర్తమానంలో పతనమై వచ్చుకాలము కంటే గతకాలము మేలన్న నన్నయ్యను గుర్తుతెచ్చుకుంటాడు.
ఉందిలే మంచికాలం ముందుముందునా అంటూ ధైర్యం చెప్పిన
వైతాళికులు సైతం పసిడిరెక్కలు విసిరి పారిపోయిన,
మసకబారిన సాంప్రదాయపు జాడలకోసం తడుముకుంటాడు.
భవిష్యత్తు మీద శంకే గతం మీద బెంగ,
తొణికిన స్వప్నాలను మరోసారి హత్తుకోవాలని విరిగిన బంధాలను తిరిగి అతికించుకోవాలని,
పల్లెటూరు,మట్టిబాల్యం,వీధిబడులు,జమ్మిచెట్టు,పాలపిట్ట,
సేమోల్లంఘనం,అలైబలైలు మళ్ళీరావు ఎక్కడ ఉంటాయో అసలు
ఉండవో కూడా భవిష్యత్తు తరానికి తెలియదు.
శిథిలమయ్యి ,శల్యమయ్యి, అవన్ని అక్కడే ఉంటాయ్,
కాని మనం అక్కడికి వెళ్ళం, చిట్టచివరికి బెంగపడడం మీద ఉన్నంత మోజు
తీర్చుకోవడం మీద ఉండదు.
వాస్తవంలో అంతరిస్తున్న సాంప్రదాయలను కాపాడుకోలేకుంటే, ముందుతరాలకు అందించకుంటే మానవుని నిర్వచనమే మారిపోతుంది ప్రశ్నార్థకమవుతుంది...!

Subscribe to:
Posts (Atom)