Saturday, August 25, 2012

నేను చూసాను నిజంగా_ ఆకలితో అల్లాడి మర్రిచెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి. నేను చూసాను నీరంధ్ర వర్షాన వంతెన క్రింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని. నేను చూసాను నిజంగా_ తల్లి లేక తండ్రి లేక ఏడుస్తూ మోజేతులతో కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ ప్రక్కనే నిద్రించిన మూడేళ్ళ పసివాన్ని. నేను చూసాను నిజంగా_ మూర్తిభవత్ దైన్యాన్ని, హ ైన్యాన్ని........ నాకు శాంతి కలగదింక నేస్తం. నేను నిగర్వినైనాను. ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు ? ఏ భగవంతునికి నివేదించుకోగలదు ?? వద్దు....ఇక నన్ను నిర్భంధించకు నేస్తం. ఈ రాత్రి నేను పాడలేను. ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను.. - దేవరకొండ బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి )

No comments:

Post a Comment